భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్

సాక్షి డిజిటల్ అక్టోబర్ 30 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్
బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మరియు అందరు అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వనరులలో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటువద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *