సాక్షి డిజిటల్ న్యూస్/ అక్టోబర్ 30/తల్లాడ, తల్లాడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షల కారణంగా కోతకి వచ్చిన వరి పంట భూముల్లో నిలిచిపోయిన వర్షపునీరు. వరిసాగు చేస్తున్న రైతులకు నష్టం వాటిలుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు బాధిత రైతులు మరి కొద్ది రోజుల్లో వరి కోతకు సిద్ధమై ఉన్నందు వలన పూర్తిగా నేలమట్టమైన వరి పంట దెబ్బ తినడం వల్ల నోటి కడికి వచ్చిన పంట ఈ తుపాన్ కారణం వల్ల నష్ట పోయినం అని గ్రహించిన బాధిత రైతులు దెబ్బ తిన్న పంటలను వ్యవసాయ అధికారులు తక్షణమే పరిశీలించి ప్రభుత్వం నకు నివేదిక పంపి దెబ్బ తిన్న వరి రైతులకు నష్ట పరిహారం అందేలా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.