సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 పెనగలూరు రిపోర్టర్ మధు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనమలూరు మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కారణంగా మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ పెనగలూరు ఎస్సై బి రవి ప్రకాష్ రెడ్డి బృందం హై అలర్ట్ గా ఉంటూప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు. పగలు రాత్రి కురుస్తున్నజోరు వాన ను లెక్కచేయకుండా పోలీస్ బృందాలను నలువైపులా పంపిస్తూ తన వెంట ఓ బృందాన్ని ఉంచుకొని నదులు చెరువులు కాలువలు వంకల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రవహిస్తున్న వరద నీటిని చూసేందుకు వస్తున్న జనాన్ని అప్రమత్తం చేస్తూ నేటి సమీపానికి రావద్దని హెచ్చరికలు చేస్తున్నారు ప్రధానంగా సింగనమల ఈటిమాపురం మధ్యలో గుంజనీరుపై ఉన్న హై లెవెల్ బ్రిడ్జి వద్ద వరద నీటిని చూసేందుకు వస్తున్న ప్రజలను అక్కడికి రాకుండా నచ్చజెప్పి వెనుకకు పంపిస్తున్నారు. అలాగే నారాయణ నెల్లూరు ఓబిలి సిద్దవరం నర్సింగరాజపురం పల్లంపాడు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ చేయటినది వద్దకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ సిబ్బంది మాత్రం కార్యాలయాల పనివేళలకు మాత్రమే కార్యాలయానికి వచ్చి ఆ తర్వాత నింపాదిగా గ్రామాలకు వెళ్లడం విశేషం. ఫోటో సింగనమల ఈటిమాపురం మధ్యలో గుంజేనేరుపై గుంజే నేరుపై ఉన్న హై లెవెల్ బ్రిడ్జి పైన ప్రజలకు సూచనలు ఇస్తున్న ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి