బూర్లపల్లిలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

సాక్షి డిజిటల్ న్యూస్ : 29 అక్టోబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నందు క్షణికావేశంలో ఉరి వేసుకుని యువకుడు బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన పిటిఎం మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బూర్లపల్లెకు చెందిన వెంకట రమణ, రవణమ్మ దంపతుల కుమారుడు పల్లపు సతీష్ కుమార్(22) బూర్లపల్లిలోని తను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా గతంలోనూ ఇతని సోదరుడు ఉరి వేసుకునే ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లి దండ్రులు తల్లడిళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు…