బీసీ నూతన మండల కార్యవర్గం ఏర్పాటుజాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

★బిసి మండల అధ్యక్షునిగా నేరెళ్ల సంతోష్

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 కామారెడ్డి జిల్లా, గాంధారి మండల కేంద్రంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం బీసీ నాయకులు నూతన ఎన్నిక సర్వసభ్య సమావేశం బుధవారం రోజున నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేందర్, ఆధ్వర్యంలో గాంధారి మండల జాతీయ బిసి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం గాంధారి మండల అధ్యక్షులుగా నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షునిగా చీమలవారు శ్రీనివాస్, దొల్లు లక్ష్మి నారాయణ, సరంపల్లి బాలకృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీగా నస్కంటి రవి, తాటిపాముల శివకుమార్, జాయింట్ సెక్రటరీగా వంజరి రాకేష్, ఆనంద్ రావు, కోశాధికారిగా సామల రాజు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఆకుల రాకేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా చింతల శంకర్, మాట్లాడుతూ.. బీసీలు ఆత్మీయంగా ఉండి మన హక్కుల్ని సాధించుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని రాజకీయాల్లో బీసీల సత్తా చాటాలని ఆయన అన్నారు. నూతన అధ్యక్షులు నేరెళ్ల సంతోష్ మాట్లాడుతూ.. బీసీలకు జరుగుతున్న అన్యాయలపై ఎదిరించి న్యాయంపై పోరాటం చేస్తామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీలు మోసపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులల్లో యువకులల్లో చైతన్యం కలిగించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధారి టౌన్ అధ్యక్షులు తూర్పు సందీప్, ఉపాధ్యక్షులు తాటిపాముల సత్యం. జనరల్ సెక్రటరీ అరెకటిక మోతిలాల్.యూత్ అధ్యక్షులు సిందే నితిన్, ఉపాధ్యక్షులు పానకంటి నవీన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.