బిఆర్ఎస్ పార్టీ చిట్టిగిద్ద గ్రామ కమిటీ అధ్యక్షులుగా బక్కని రామచందర్..

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30:నవాబుపేట్ మండలం. నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామ బిఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా బక్కని రామచందర్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేవెళ్ల జయపాల్ రెడ్డి, అయ్యగాల నరేందర్, ప్రధాన కార్యదర్శిగా బ్యాగరీ అనంతయ్య, కార్యదర్శులుగా మర్మారి రమేష్, తరుణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా దాసరి సందీప్, అధికార ప్రతినిధిగా అయ్యగాల నవీన్ ,యువజన విభాగం అధ్యక్షుల దాసరి ప్రదీప్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బక్కని శ్రీకాంత్, బిసి సెల్ అధ్యక్షులుగా ప్రశాంత్ , మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఆసిఫ్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిటిగిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా కార్యాచరణ ఉంటుందని ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండ గాడుతూ గత బిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిటిగిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి మరియు జెడ్పిటిసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నవాబుపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గణపురం శాంతి కుమార్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సిల్వరీ గోవర్ధన్ ,విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం మండల నాయకులు శేఖర్, రాము తదితరులు పాల్గొనడం జరిగింది.