ప్రభుత్వం ఇచ్చినహామీలను అమలు చేయాలి

★కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నేత ఆదూరి ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (అక్టోబర్ 29) : సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదూరి ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రూ.రెండు లక్షల వరకు రుణాలు అందరికీ మాఫీ చేయలేదన్నారు.రైతుబంధు ఇప్పటివరకు వారి ఖాతాలో వేయలేదన్నారు.మహిళలకు ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 అమలు కాలేదు అన్నారు.రూ.500 గ్యాస్ పథకం కూడా ఎవరికి రావడం లేదన్నారు.రైతుబంధు,రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అందరికీ అమలు కాలేదని, సాంకేతిక సమస్యలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు.రైతాంగాన్ని మోసం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే విధంగా ప్రభుత్వం తీరు ఉన్నదని ఆరోపించారు.ఆత్మీయ భరోసా,మహిళలకు రూ. 2,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.