అక్టోబర్ 30 సాక్షి డిజిటల్ న్యూస్ కాటారం సిబి చారిప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలి.. సీజనల్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలి..ప్రభుత్వాసుపత్రిలోనే సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలి
డిఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్. సిద్దిపేట: సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన పంపించాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది పైనే ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ సూచించారు. బుధవారం సిద్దిపేటలొని తిమ్మాపూర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు , రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ లో నిర్వహిస్తున్న రక్త నమూనాల పరీక్షల రిజిస్టర్లను, ఫార్మసీ గదిలోని మందుల నాణ్యతకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. వ్యాక్సిన్ భద్రపరిచే గదిలోకి వెళ్లి వ్యాక్సిన్ల నాణ్యత, ఐఎల్ఆర్ కోల్డ్ చైన్ విధానాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి మంగళవారం, శుక్రవారం, నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమానికి సంబంధించి వివరాలను, ఈరోజు ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఉప కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది దేనని చెప్పారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని హాస్టలను, పాఠశాలలను సందర్శించాలని సూచించారు. హాస్టల్లో పిల్లలకు అందుతున్న ఆహారాన్ని , మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు అన్ని ఆరోగ్య కార్యక్రమాల సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసు కోవాలన్నారు. అవసరమున్నవారికి రక్త పూతలు సేకరించి చికిత్స అందించాలని ఆదేశించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సాధారణ ప్రసవాలపై దృష్టి Iపెట్టాలి… ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా దృష్టి పెట్టాలన్నారు. వరదల తాగిడికి గురయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలించి సుఖ ప్రసవం జరిగేటట్లు 102 వాహనం సాయంతో తరలించాలని సూచించారు. సమయపాలన పాటించాలి.  ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో, కుక్క కాటు పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో ఐ పి ఓ పి సంఖ్య పెంచాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దివ్యశ్రీ అందించాలన్నారు. డాక్టర్ దివ్యశ్రీ, స్థానిక సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.