పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు మరువలేనివి

సాక్షి డిజిటల్ న్యూస్ 30 అక్టోబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ) శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని బోధన్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్బర్ నగర్ పాలిటెక్నికల్ కాలేజీలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని ఇలాంటి శక్తుల్ని ఎదుర్కొంటూ ఎందరో పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నామన్నారు. పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు. ఈరోజు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొనగా రాయికూర్ జట్టు మొదటి బహుమతి సాధించగా రెండో బహుమతి సులేమాన్ నగర్ జట్టు విజయం సాధించినట్లు ఎస్సై సాయన్న తెలియజేశారు. విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, వరి పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పవన్ చంద్రారెడ్డి, ఫుడ్ సైన్స్ కాలేజ్ డీన్ డాక్టర్ వెంకట్ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ అంజాద్, నాగరాజు, పోలీస్ సిబ్బంది గంగాధర్, రాజ