సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు వరద బాధితులకు పునరావాసాలను కల్పించిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు బుధవారం విలేకరులతో మాట్లాడారు అధికారులు చింతలపూడిలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు సచివాలయంలో రాత్రి విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు సకాలంలో ఆహార పదార్థాలు ఇవ్వకపోవడంతో బాలింతలు వృద్ధులు చిన్నపిల్లలు రాత్రి పది గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు తుఫాన్ ప్రభావంతో రైవాడా ఆయకట్టు భూములు తీవ్ర నష్టం వాటిలిందని తెలిపారు గత మూడు రోజుల గా కురుస్తున్న వర్షాలు కారణంగా వ్యవసాయ కూలీలు దళితులు గిరిజనులు చేతి వృత్తిదారులుకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబానికి 35 కిలోల బియ్యంతో పాటు ముడిసరుకులను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు ఎంఎర్రి నాయుడు పాల్గొన్నారు