సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 పెనగలూరు రిపోర్టర్ మధు, పెనగలూరు మండలంలో పాడి రైతులు తమ పశువుల మేత కోసం గ్రాసం కోసం పొలాలకు వెళ్ళినప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కాకర్ల వారి పల్లి వెటర్నరీ డాక్టర్ యు సురేష్ బాబు రైతులకు సూచించారు. మంగళవారం చక్రంపేట నారాయణ నెల్లూరులోని పాడి రైతులకు మొంతా తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు పొలాలకు వెళ్లి పాడి రైతులకు కొన్ని సూచనలు చేశారు పొలాల్లో కరెంటు స్తంభాలు తాకవద్దని చెట్ల కింద నిలబడవద్దని ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో రక్షణ ప్రదేశానికి వెళ్లాలని వేగంగా ప్రవహిస్తున్న కాలువలు వంకలు గడ్డిమోపు నెత్తిన పెట్టుకొని దాట వద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పశు దాన సహాయకుడు బసవరాజు, ఏ హెచ్ ఏ లు బి భార్గవి ఎంకే హరిబాబు గోపాలమిత్ర కే పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటో చక్రం పేటలో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్న వెటర్నరీ డాక్టర్ సురేష్ బాబు బృందం