పలు గ్రామాలలో*ఐకేపీ మరియు ప్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్. రిపోర్ట్ నవీన్ కథలాపూర్ తేదీ.30 అక్టోబర్ 25, కథలాపూర్ మండలం లోని పెగ్గర్ల, ఊట్పల్లి, భూషణరావుపేట, చింతకుంట, రాజారాం తండా, లలో గల ఐకెపి మరియు ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఎ ఎం సి చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్ అలాగే ఎంపీడీవో శంకర్ ఎమ్మార్వో వినోద్ కలసి ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంటర్లలో పోసిన వరి ధాన్యం తడవకుండా ఉండేలా రైతులకు పత్రలు అందుబాటులో ఉంచవలసిందిగా ఆయా సెంటర్ల సిబ్బందికి తెలిపారు, అదే విధంగా రైతులు కూడా ఎప్పటికప్పుడు తమ ధాన్యపు కుప్పలను పరిశీలించుతూ అప్రమత్తంగా ఉండాలని సెంటర్లో పోసిన ప్రతి ఆఖరిగింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని దళారుల వద్దకు వెళ్లి ఆరు నెలలు చెమటోర్చి కష్టపడి పండించిన పంటను తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ఈ సందర్భంగా వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల శంకర్, జగన్ రావు, వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్, రమేష్ నాయక్, సీఈఓ ఉషకోలా అరున్, తలారి మోహన్, గడ్డం స్వామి రెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, గోపిడి మారుతి రెడ్డి, వేముల కృష్ణ, మాజీ సర్పంచ్ బైర మల్లేష్ యాదవ్, లోక నరసారెడ్డి,లవన్ రెడ్డి గణేష్ మార్గం శ్రీనివాస్ లింగారావు, బద్దం మహేందర్ రెడ్డి, లవన్ కుమార్, మండల కార్యవర్గ సభ్యుడు జవాజి రవి నియోజవర్గ ఎన్ఎస్ఈఐ ఇంచార్జ్ ఆకుల సంతోష్, ముదాం శేఖర్, పాల నవీన్ తిరుపతి నాయక్, అంజాగౌడ్, అలాగే భూషణరావుపేట గ్రామ కార్యదర్శి ఎండిగపూర్ దాసరి పెద్ద అంజయ్య జోడి సంతోష్ రెడ్డి తదితర గ్రామస్తులు, రైతులు, అధికారులు, పాల్గొన్నారు.