పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు దాదాపుగా తుడిసికి పోయినట్టే ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ కన్నీరు పెట్టుకున్న అన్నదాత

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు ( అక్టోబర్ 30 2025 ) తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంచికచర్ల సబ్ డివిజన్లో గల కంచికచర్ల మరియు వీరులపాడు మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు దాదాపుగా తుడిసికి పోయినట్టే లెక్క. మొక్కజొన్న కోతకు వచ్చి రెండు నెలలకు పైగా గాక అప్పటినుండి వర్షాలు ఖాళీ లేకుండా పడుతూనే ఉండటంతో పొలాల్లోనే మొక్కజొన్న పంట ఉంది ఈ వర్షాలకు మొక్కజొన్న కండల నుండి మొలకలు వస్తున్నాయి? ఈ ఏడాది మొక్కజొన్న వలన రైతులకు లాభం చేకూరుతుందని ఆశించినప్పటికీ కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పత్తి గత 15 రోజులకు ముందు పూత పిండితో కలకలలాడింది…
తుఫాను ప్రభావంతో విరుపుకు వచ్చిన పత్తి నేలపాలైంది. పూత పిందే కూడా రాలిపోయింది. కనీసం కూలీల ఖర్చు కూడా రాని పరిస్థితి ఏర్పడి రైతులు అప్పులు పాలయ్యారు. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప లేకపోతే వారికి ఆత్మహత్య లే దిక్కు. వరి పంట కంకులు పాలు పట్టి ఉన్నాయి ఈ దశలో తుఫాను ప్రభావంతో కూడిన వర్షాల వలన వరి పొలాలు వాలిపోయాయి. దీనివల్ల వరి ధాన్యం దిగుబడి 100% 100% దిగుబడి రాదు కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. మిర్చి పరిస్థితి కూడా అదే విధంగా తయారయింది. ప్రభుత్వం తుఫాను వలన నష్టపోయిన అన్ని పంటల రైతులకు నష్టపరిహారం అందజేయక పోతే రైతులు పూర్తిగా అప్పులు పాలవుతారు కనీసం తినటానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ తుఫాను వలన పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.