సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో మరియు ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పంట మరియు విరిగిన అరటి చెట్లను పరిశీలించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి . ఉచ్చిలి గ్రామంలో 4 ఎకరాలకు సుమారు 2 ఎకరాల అరటి చెట్లు విరిగి నేలకొరిగిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా మండలం మీద సుమారు 50 శాతం వరకు దెబ్బతిన్నాయి. అనంతరం జగ్గిరెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు , ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
