నిరుపేద కుటుంబానికి బియ్యం, సరుకులు అందిస్తున్న టీచర్ వెంకటేష్

అక్టోబర్ 30, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, సత్తుపల్లి పట్టణంలోని ఎన్టిఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మామిడి కటాక్షమ్మా ఈమెకి మతిష్ఠిమితం లేని (మెంటల్లి హ్యాండీక్యాప్పెడ్ )కూతురు, కొడుకు ఉన్నారు. కుటుంబ భారం అంతా ఈమె చూసుకోవాలి. తినటానికి బియ్యం, సరుకులు ఏమి లేవు. వెంకటేష్ మాస్టర్ ని వెదుక్కుంటూ వారి ఇంటికి వచ్చి, తన బాధను వివరించింది, విషయం తెలుసుకున్న మాస్టర్ వెంటనే స్పందించి ఒక నెలకు సరిపడా సరుకులు, సర్దుతానని చెప్పి, చేతికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి, తానే స్వయంగా తన బండి మీద ఎక్కించుకుని తిరిగి సత్తుపల్లి లోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంటిదగ్గర పంపించి వచ్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాస్టర్ మాట్లాడుతూ గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యేకి వినతి. ఈమె ఎన్టిఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఈ మామ్మకి, ఇద్దరు పిల్లలకి పెన్షన్ ఇప్పించి వారికి వెలుగు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. గత మూడు నెలల నుండి నేనే వారికి పెన్షన్ ఇస్తున్నాను అని అన్నారు. గతంలో ఈమెకి 50 కేజీలు బియ్యం, 1000 రూపాయలు అందజేశానని అన్నారు. ఇటువంటి నిరుపేదకి ఎవరైనా సహాయం అందించాలని కోరారు.