నందిగామలో నిత్యం పర్యవేక్షణలో ఎమ్మెల్యే సౌమ్య తోపాటు అధికార యంత్రాంగం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్:బొక్కా నాగేశ్వరరావు (అక్టోబర్ 30 2025 ) మొంథా తుఫాన్‌తో కూడిన భారీ వర్షాలు కారణంగా నందిగామ మండలంలో సంభవించిన అకాల వర్షాలు మరియు పొంగుతున్న వాగులను తంగిరాల సౌమ్య గ చందాపురం గ్రామం వద్ద నల్లవాగును పరిశీలించారు, ఈ నేపథ్యంలో నందిగామ పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ పరిశీలిస్తూ, ఏసిపి తిలక్, అవసరం ఉన్న చోట సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇటు రోడ్లపై వృక్షాలు పడడంతో సిఐ వై విల్ నాయుడు, ఎస్సై అభిమన్యు, ట్రైనింగ్ ఎస్ఐ సురేష్ చెట్లు తొలగించే వరకు అక్కడే పని చేస్తూ వాహనదారులకు రోడ్డు కు అంతరాయం లేకుండా పర్యవేక్షిస్తూ ఇటు ఎస్సై శాతకర్ణి వాగుల దగ్గర పోలీసు పర్యవేక్షణ చేస్తూ చందాపురం, రమణ కాలనీ వాగులు దగ్గర ఏఎస్ఐ రవికుమార్ నిత్యం అక్కడే ఉండి పరిశీలన చేస్తూ ప్రజలను, ఇటు వాహనదారులు సూచనలు అందిస్తూ తుఫాను వెళ్లే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటు రెవెన్యూ డివిజనల్ శాఖ ఆర్డిఓ బాలకృష్ణ రెవెన్యూ సిబ్బందిని నియమించి ప్రతి ఒక్క విషయం ఎప్పటికప్పుడు అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉంచి ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచనలు ఇవ్వాలని ఏదైనా అవసరం అయితే వెంటనే అధికారులకు తెలియ జేయాలని అవసరం ఉన్న చోట రెవెన్యూ అధికారులు అందరినీ ఎమ్మార్వో సురేష్ పర్యవేక్షణలో పునరవాస కేంద్రాల దగ్గర, పొర్లి ప్రవేశిస్తున్న వాగుల వద్ద పర్యవేక్షణ నిత్యం ఉన్నదని పేర్కొన్నారు. నందిగామ మున్సిపల్ అధికారి కమిషనర్ లోవరాజు, ఇట్స్ శానిటరీ ఇన్స్పెక్టర్, తుఫాన్ మొదలైన దగ్గర నుండి మున్సిపల్ సిబ్బంది అవసరం ఉన్న చోట పని చేస్తూ అక్కడే నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని, తుఫాను వెళ్లే వరకు మున్సిపల్ సిబ్బంది త్రాగునీరుకు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మున్సిపల్ అధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.