దుర్గామాత కి స్వర్ణ కిరీటం సమర్పణం

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 29: రిపోర్టర్ తిరుపతి : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలో మరి కొడకా గ్రామంలో ని విజయదుర్గా దేవాలయ వార్షికోత్సవం లో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం
స్వర్ణ కిరీటానికి ప్రత్యేక పూజలు, అధివాసాలు అధివాసాంగ హోమాలు నవావరణ యాగం మూల మంత్ర హవవనం బుధవారం పదిన్నర గంటలకు కంచి కామకోటి మూలామ్నాయ సర్వఙ్ఞ పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి రాక స్వామి కి ఘన స్వాగతాం పలకడం జరిగింది. స్వర్ణ కిరీట సమర్పణ అనంతరం స్వామివారి భిక్షావందనం మధ్యాహ్నం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహ భాషణం రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వర్గల్ సరస్వతీ దేవాలయం చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పలువురు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల అందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది.