దున్నపోతు మీద వాన.. అధికారులకు చెప్పిన బాధ

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 29 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: దున్నపోతు మీద వాన పడ్డట్టు నాకేం కాదులే అన్నట్టు, మణుగూరు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రజా సమస్యలు పట్టించు కోవడంలేదని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ఎద్దేవా చేశారు. మన ఊరు సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు షాపు యజమానులు, కూరగాయల యజమానులు ఫుట్పాత్ ఆక్రమించి అద్దెకు ఇచ్చుకుంటూ వ్యాపారాల సాగిస్తూ అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని, ఫలితంగా బాటచారులు నడవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మణుగూరు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, నిమ్మకు నీరెట్టినట్టు నచ్చినట్టుగా వివరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాతులు ఆక్రమణ నిలిపి వేయకపోతే, జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు.