సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ విశాఖపట్నం హార్బర్ లో తుఫాను , అలలు తాకిడికి ఒక బోటు మునిగిపోవడం జరిగింది అనుకోకుండా జరిగిన ఘటన విషయాన్ని పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది మునిగిపోయిన బోటు విలువ సుమారు 30 లక్షల ఉంటుంది ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కొంత, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత నష్టపరిహారం రిలీజ్ చేయించి వారిని పూర్తిగా ఆదుకుంటాము ఈ ఒక్క ఘటన మినహా హార్బర్ ఏరియా ప్రశాంతంగా ఉంది దక్షిణ నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉండడం వలన నీరు ఎక్కువగా చేరడం వల్ల ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ, పోలీస్, జీవీఎంసీ యంత్రాంగం గత నాలుగు రోజుల నుండి అదేపనిగా పనిచేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు పవర్ పోయిన, చెట్లు పడిపోయిన వెంటనేస్పందిస్తున్నారు ,అధికారులు అందరూ ఎలార్ట్ గా ఉన్నారు తుఫాను తీవ్రత తగ్గింది,విశాఖ ప్రశాంతంగా ఉంది ,ఎటువంటి ఇబ్బందులు లేవు మరో రెండు రోజులు వర్షం పడినా వచ్చే ఇబ్బందులు ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నాము తుఫాను కారణంగా ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో నిలిపివుంచిన మేరుగ ధనరాజు గారి బోటు ( ఏపీ వి5 MM90) మునిగిపోయిన నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హుటా హుటున సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సుమారు 30 లక్షలు మేర నష్టపోయామని సంబంధిత బోటు యజమాని మరియు అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే తెలియజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక అధికారులతో మాట్లాడి బోటు ఓనరుకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు గారితో పాటు సంబంధిత అధికారులకు ఘటనను వివరించామని త్వరలోనే నష్టపరిహారం అందిటట్లు చర్యలు చేపడతామని తెలియజేశారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉందని వివరించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు, స్థానిక మత్స్యకారులు, టిడిపి, బిజెపి, జనసేన నేతలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
