తుఫాన్ తో నష్టం జరిగిన రైతులందరికి ప్రభుత్వం ఆదుకోవాలి

సాక్షి, డిజిటల్ న్యూస్, అక్టోబర్ 29, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బూర్ల రాజు,
తుపానుతో పంట నష్టం జరిగిన రైతులందరినీ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికపై ఆదుకోవాలని మండల మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్, కన్నాపూర్ మాజీ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి లు డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం భారీ వర్షంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చేతికి వచ్చిన వేలాది ఎకరాల వరి పంట నేలమట్టం కావడం జరిగిందన్నారు, దీంతో భారీ నష్టం ఏర్పడడంతో రైతులు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు, కుండపోత వర్షంతో చేతికి వచ్చిన పంటచేను మట్టి పాలు కావడం జరిగిందన్నారు, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు ఆమె చెప్పారు, అంతేకాకుండా అనేక గ్రామాల్లో కూడా వరి ధాన్యం తడిసి ముద్దయిందన్నారు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు, ధాన్యం కొనుగోలు చేయుటలో అధికారులు వ్యాపారులు కొర్రీలు , పెట్టకుండా వరి ధాన్యాన్ని తూకం పెట్టాలన్నారు, లక్షలాది రూపాయల వరి పంటలు నేలమట్టం కావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికపై అన్ని గ్రామాల్లో నే లమట్టమైన వరి చేనులను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు, ప్రభుత్వ యంత్రాంగం నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.