తుఫాను ప్రభావం ఎక్కువగా వున్నది రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రాహుల్ రాజ్

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి అన్ని కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్స్ అందుబాటులో ఉంచుకోవాలి అని
కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మొంథా తుఫాను నేపథ్యంలో క్షేత్ర స్థాయి లో అధికారులు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *