సాక్షి డిజిటల్ న్యూస్ / అక్టోబర్ 30/తల్లాడ తల్లాడ పట్టణం నారాయణపురం గ్రామం లో స్థానిక హెచ్. పి పెట్రోల్ బంక్ ముందు (లలితమ్మ హోటల్ )దెగ్గర వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో స్వస్తిశ్రీ చంద్రమానేన శ్రీ విశ్వవాసు నామ సంవత్సర కార్తీక మాస బహుళ పంచమి 10/11/2025 కార్తీక మాస మూడవ సోమవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం కొత్తగూడెం ఉభయ జిల్లాలలోని కనివిని ఎరుగని రీతిలో లక్ష గాజులతో ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి విశేషాలంకరణ దర్శనం. ఈ కార్తీకమాసము హరిహరులకు చాలా ప్రీతి కరమైనది. అభిషేక ప్రియ శివాఅలంకరణ ప్రయో విష్ణు హరిహరధులకు ఇష్టముగా పరమేశ్వరునికి ప్రీతిగా 108 మట్టి కలశములతో పంచామృత నవరస విశేష ద్రవ్యములతో స్వామివారికి విశేష రుద్రాభిషేకము. మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము సాయంత్రం ఏడు గంటల నుండి ఎంతో విశేషంగా జరుగును. కావున ఈ కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము మరియు రుద్రాభిషేకం చేయించుకునే భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించగలరు. సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు భజన కార్యక్రమం కలదు. కావున భక్తులందరూ విచ్చేసి ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని సాయంత్రం జరిగే సత్యనారాయణ స్వామి వ్రతము మరి విశేష రుద్రాభిషేకము దర్శించుకుని సత్యనారాయణ స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఈ పూజా కార్యక్రమలు బ్రహ్మశ్రీ కంచల శ్రీ సతీష్ శర్మ చే నిర్వహించబడును. ఈ పూజ కార్యక్రమం కు కావలిసిన సరుకుల వివరాలను సతీష్ శర్మ ని అడిగి తెలుసుకోగలరు.