జిల్లాలోని పారిశ్రామిక వ్యర్ధ కాలుష్యం గురించి జిల్లా మానవ హక్కుల సంఘం సమావేశం

★మానవాళి పుట్టుక,జీవనాన్ని, ఆరోగ్యాన్ని,ఆహారాన్ని కలుషితం చేస్తూ కాలరాస్తున్న ఫార్మా కంపెనీలు . ★గ్రామాలు,పట్టణాల అభివృద్ధి వేగంగా పెరుగుతుంటే దానికి అనుగుణంగా ఈ కంపెనీలను తరలించాల్సి ఉంది

సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 29,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా మానవ హక్కుల సంఘం సమావేశంలో జిల్లా మానవ హక్కుల సంఘం చైర్మన్ యెల్లంల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఫార్మా కంపెనీల ద్వారా వచ్చే వ్యర్ధాలను చెరువులు,కుంటలు,కాలువల్ల,అడవుల్లో పారబోయడం వల్ల చౌటుప్పల్,పోచంపల్లి,బొమ్మలరామారం మండలంలోని రంగాపురం గ్రామంలో, బీబీనగర్ మండలం, అలాగే వంగపల్లి తదితర గ్రామాల్లో ఉన్న రైతులు వారి పంటపొలాలలో ఈ కెమికల్స్ ద్వారా పంట పండక పోవడం, వారు తాగుదామన్నప్పటికీ త్రాగునీరు కూడా కలుషితంగా అవడం,గాలి కలుషితం, భూమి కలుషితం వారికి ఈ కంపెనీలు సమస్యలు ఎదురవుతున్న,ప్రజలు తిరగబడుతున్న సందర్భంలో స్థానికంగా ఉన్న పోలీసుల బందోబస్తుతో అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం కూడా జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ ఆర్వో ఏర్పాటు చేయడం,ఆ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు నీళ్ళు కూడా వాసనతో కూడుకుని వస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు ఆ నీటిని కూడా తాగలేకపోతున్నారు.వారు గ్రామాల్లో ఉండటమే కష్టంగా మారిపోయింది.ఈ కెమికల్ కంపెనీల ద్వారా ఆ గ్రామాల్లో ప్రజలు నేటికి 90% ప్రజలు హైదరాబాదు నగరంలోనే నివసిస్తున్నారు.సొంత గ్రామం ఉన్నా పొలాలు భూములను వదులుకొని వారు హైదరాబాదుకు వచ్చి చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కానీ ఆ ఊర్లలో 70 ఏళ్ళ పైబడిన వారు తప్ప యువత కనిపించకపోవడం గమనార్హం.ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆడపడుచులకు,పశు పక్ష్యాదులకు సైతం ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా కష్టంగా మారిపోయిందని, చిన్నపిల్లలకు శ్వాసకోశ సమస్యలు,విద్యార్థులకు ఆరోగ్యపరమైన కిడ్నీ సమస్యలు ఈ నీటి కాలుష్యం ద్వారా వస్తుందన్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు పేద ప్రజలకు అండగా ఉండకపోగా ఆ కంపెనీల వారికి బాసటగా నిలుస్తూ పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు తప్ప, వారికి తగిన న్యాయం చేయలేక పోతున్నారని తెలిపారు. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్ధాల వల్ల వ్యవసాయ భూములు పాడుబడి పోయాయని, పంటలు కూడా పండతం లేదని, ఈ ప్రాంతాల్లో పండిన పంటలను కూడా ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని, ఈ ప్రాంతాల్లోని అబ్బాయిలకు పిల్లలను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ కంపెనీల పైన తగిన చర్యలు తీసుకొని ఆ కంపెనీలను ఇక్కడి నుండి తీసివేస్తే బాగుంటుందని,పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్ యెల్లంల శ్రీధర్ రెడ్డి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా వైస్-ప్రసిడెంట్ మన్నె పద్మారెడ్డి, జాతీయ మానవ హక్కుల కమిటీ రామన్నపేట మండల చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.