సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు మండలంలోని రైవాడ జలాశయాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చింతల బుల్లి లక్ష్మి జెడ్పిటిసి కర్రీసత్యం తో అధికారులు ఎంపీడీవో ఎంవి సువర్ణ రాజు పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ పివివి త్రినాధరావు బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జలాశయంలోకి నది ప్రభావ ప్రాంతాల్లోకి సంచరించకూడదని విజ్ఞప్తి చేశారు అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని సూచించారు ఆయా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు