గొర్రెల దొంగలను పట్టుకొని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 29 అక్టోబర్ 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
గొర్రెల దొంగలను పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని జి ఎం పీ ఎస్ జిల్లా అధ్యక్షులు మద్దెపురం రాజు భువనగిరి రూరల్ యస్ ఐ మిర్యాల అనిల్ కుమార్ ను కోరారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ. భువనగిరి మండలం వడపర్తి గ్రామం మేడబోయిన బాలయ్య గొర్రెల మందలో తేది:28-10-2025 మంగళవారం రాత్రి 07-30 నుండి 08.30ని.ల మధ్యలో నలుగురు గుర్తు తెలియని దుండగులు మందలో చొరబడి సుమారు 100 గొర్రెలను ఎత్తుకుపోగా బారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.దీనికి సంబందించిన దృశ్యాలు సోలార్ సిసి కెమెరాలో నమోదు కాగా ఈ విషయం భాధితులు భువనగిరి రూరల్ యస్ ఐ మిర్యాల అనిల్ కుమార్ కు అక్టోబర్ 29 బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు.కావున సిసి కెమెరా పుటేజీల ఆధారంగా విచారణ వేగవంతం చేసి వీలైనంత త్వరగా గొర్రెల దొంగలను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించి గొర్రెల కాపరి కుటుంబానికి న్యాయం చేయాలని మద్దెపురం రాజు కోరారు