సాక్షి డిజిటల్ న్యూస్ 30 అక్టోబర్ 2025 ( జగిత్యాల్ జిల్లా ఇంచార్జ్ ) బోనగిరి మల్లారెడ్డి. గొల్లపల్లి మండల కేంద్రంలోని బెయేర్షెబా చర్చిలో ధర్మపురి నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శ్రీమతి కాంత కుమారి పాల్గొని ఆపరేషన్ క్రిస్టమస్ చైల్డ్ ప్రోగ్రాం ద్వారా చర్చిల్లోని చిన్నపిల్లలకి క్రొత్త నిబంధన బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ.ఇ. శ్రీనివాస్ జోసఫ్. మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు రెవరెండ్ బీ సీమోను గారు,పాస్టర్ జి లాజర్, పాస్టర్ ఐ సైమన్ పాస్టర్ ఎం రమేష్, మంచిర్యాల్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ జె స్వామి దాసు మరియు పాస్టర్స్ పాల్గొన్నారు.