సాక్షి డిజిటల్ అక్టోబర్ 30 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : గ్రూప్ -1 నియామకాలలో భాగంగా జగిత్యాల జిల్లాకు కేటాయించిన డిపివో వై. రేవంత్ బుధవారం సమీకృత జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ నేపథ్యంలో నూతన డిపివో గా ఉద్యోగం సాధించినందుకు కలెక్టర్ బి. సత్యప్రసాద్, డిపివో రేవంత్ ను అభినందించారు. ఈ సందర్బంగా నూతన డిపివోకు అంకితభావంతో విధులు పట్ల బాధ్యతలు నిర్వర్తించాలని ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన ప్రజలకు కలెక్టర్ ఆదేశాల మేరకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిపివో మదన్ మోహన్ పాల్గొన్నారు.