అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

★జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బండారు

సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చేపట్టాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులకు సూచించారు రైవాడా జలశయాన్ని బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ తుఫాన్ సృష్టించే విపత్తులను అధిగమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పటిష్టమైన చర్యలు చేపట్టి అన్ని శాఖ అధికారులను అప్రమత్తం చేశారన్నారు కూలిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునర్దించాలన్నారు జలాశయం కు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జనరేటర్ లు త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గత వైసిపి ప్రభుత్వం జలాశయాల అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే రాష్ట్రఅభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నామన్నారు శిథిలావస్థలో నివాసం జీవిస్తున్న కుటుంబాలకు వాటిని కూల్చి నూతన గృహాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వం 2 లక్షల80 వేల రూపాయలు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పి4 సర్వే త్వరలోనే మొదలవుతుందని తద్వారా గృహాలను బడుగు బలహీన నిరుపేదలకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అనంతరం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జలాశయం చైర్మన్ పోతల పాత్రునాయుడు నాయుడు మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ జిల్లా కార్యనిర్వహణ ఇంజనీరు ఏ త్రినాధం కోటపాడు సిఐ పైడం నాయుడు తాసిల్దార్ పి లక్ష్మీదేవి ఎస్సై సత్యనారాయణఎంపీడీవో ఎంవి సువర్ణ రాజు డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్ పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ డి ఈ సత్యం నాయుడు వ్యవసాయ అధికారిని ఎల్ వై కాంతమ్మ విద్యుత్ శాఖ ఏఈ లింగేశ్వరరావు దేవరాపల్లి కలిగొట్ల పిఎసిఎస్ అధ్యక్షులు పూడి సత్యారావు దొగ్గ దేవుడు నాయుడు రావికమతం టిడిపి పార్టీ పరిశీలకులు చిటిమరెడ్డి సూర్యనారాయణ మండలం అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా నానాజీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు శరకాన సూర్యనారాయణ మాజీ సర్పంచ్ చల్లా తాతయ్యలు సబ్బవరపు మాలి బాబు అల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు