సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 పిట్లం మండలం భూమయ్య రిపోర్టర్ పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన నల్లాల సాయి స్మరణ ప్రస్తుతం పిట్లంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది ఏడవ తరగతి నుండి టాబ్లెట్స్ పైన ప్రకృతి అందాలను గీస్తూ మందారపు ఆకుల పైన బొండు మల్లె ఆకుల పైన సీతారాముల చిత్రపటాలు గాంధీ వివేకానంద లాంటి మహనీయుల చిత్రాలు వేస్తూ ప్రజాప్రతినిధుల ప్రభుత్వ అధికారుల అభిమానం చూరగొన్నది ఖాళీ సమయంలో ఇలాంటి చిత్ర పటాలు వేస్తూ అటు చదువులోనూ ప్రథమ స్థానంలో రాణిస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంది ఇటు క్రీడరంగంలో కూడా అండర్ 16 మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి అందుకొని అటు తను చదువుతున్న గురుకుల పాఠశాలకు అమ్మానాన్నలకు తన గ్రామానికి పేరు తీసుకువస్తుంది.వ్యక్తిగతంగా తనకు బంగారు పతకం గురుకుల పాఠశాలకు ప్రథమ బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇదంతా మహాత్మ జ్యోతిబాపూలే సిబ్బంది సహకారం వల్లనే అలాగే అమ్మానాన్నల సాయం కూడా మర్చిపోలేనిదని సాయి స్మరణ తెలియజేశారు.