సాక్షి డిజిటల్ న్యూస్:29 అక్టోబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ పరిధిలో గల కలెక్టర్ కార్యాలయం నందు DM సైదులు,HO శైలజ ఆధ్వర్యంలో అంగన్వాడి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలు,పోషక ఆహార ప్రాముఖ్యత,రోగులు మరియు వికలాంగులు కోసం అందుబాటులో ఉన్న వైద్య సేవలు మరియు ఆసుపత్రి వివరాలు,చికిత్సా విధానాలపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు. అప్పుడప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తామని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.